ఎమిరేట్స్‌ ప్రవాస భారతీయులకు శుభవార్త - Now UAE Indian expats can renew passport in 2 days
close
Published : 02/08/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎమిరేట్స్‌ ప్రవాస భారతీయులకు శుభవార్త

దుబాయి: యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్ (యుఏఈ)లో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. ఇక్కడి ప్రవాస భారతీయులు కేవలం రెండు రోజుల్లోనే తమ పాస్‌పోర్ట్‌లను పునరుద్ధరించుకునేందుకు (రెన్యూవల్‌) వీలుగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సౌలభ్యం నేటి నుంచి అమలులోకి రానుందని తెలిసింది. నూతన విధానం ప్రకారం.. ప్రవాసుల నుంచి పాస్‌పోర్టు దరఖాస్తు స్వీకరించిన రోజే సంబంధిత ప్రక్రియ ప్రారంభమవుతుందని దుబాయిలోని కౌన్సిల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ అమన్‌పురి వెల్లడించారు. అయితే పోలీసుల నిర్ధారణ, భారత్‌ నుంచి అనుమతులు లభించాల్సి రావటం తదితర ప్రత్యేక అనుమతులు అవసరమైన సందర్భాల్లో ఈ ప్రక్రియ సుమారు రెండువారాల పాటు కొనసాగవచ్చని ఆయన వివరించారు.

అంతేకాకుండా ఏ ఎమిరేట్స్‌ సభ్యదేశంలో నివసించే భారతీయుడైనా ఇకపై దుబాయిలో ఉన్న భారత రాయబార కార్యాలయంలో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. కాగా, ఇప్పటి వరకు సభ్య దేశాలకు వేర్వేరు పాస్‌పోర్ట్‌ ధృవీకరణ కేంద్రాలను నిర్వహించేవారు. గత సంవత్సరం ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా అధికంగా ఇక్కడి కార్యాలయం రెండు లక్షలకు పైగా పాస్‌పోర్టులను జారీ చేసిందని ఇక్కడి అధికారులు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని