డిప్యూటీ స్పీకర్‌, 11మంది ఎమ్మెల్యేలకు కరోనా - Odisha deputy speaker 11 other MLAs test positive for COVID- 19
close
Updated : 29/09/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిప్యూటీ స్పీకర్‌, 11మంది ఎమ్మెల్యేలకు కరోనా

భువనేశ్వర్‌: ఒడిశాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. మంగళవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ డిప్యూటీ స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌, మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. వర్షాకాల సమావేశాల సందర్భంగా శాసనసభ్యులు, పాత్రికేయులు, అధికారులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. కొవిడ్ నెగెటివ్‌గా తేలిన వారిని మాత్రమే సభలోకి అనుమతిస్తామని ప్రకటించారు. స్పీకర్‌ ఎస్‌.ఎన్‌ పాత్రో ఆదేశాల నేపథ్యంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఇంకొందరి నివేదికలు మంగళవారం రానున్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు,  ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పరమిళ మల్లిక్‌కు గత ఆదివారం రోజే కరోనా పాజిటివ్‌గా తేలింది. తాను కరోనా బారిన పడ్డానని, భువనేశ్వర్‌లోని ఆస్పత్రిలో చేరినట్టు డిప్యూటీ స్పీకర్‌ తెలిపారు. తనతో కాంటాక్ట్‌ అయినవారంతా పరీక్షలు చేయించుకోవాలని ట్విటర్‌లో కోరారు. ఒడిశాలో ఇప్పటివరకు తొమ్మిది మంది మంత్రులతో పాటు మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు ఈ వైరస్‌ బారినపడ్డారు. వీరిలో చాలామంది క్వారంటైన్‌ సమయం ముగిసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని