బిల్లులను వెనక్కి పంపండి.. రాష్ట్రపతికి వినతి - Opposition parties request President Kovind not to give assent to contentious farm bills
close
Published : 24/09/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిల్లులను వెనక్కి పంపండి.. రాష్ట్రపతికి వినతి

దిల్లీ: పార్లమెంట్‌ ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై సంతకం చేయొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను విపక్షాలు కోరాయి. రాజ్యాంగ విరుద్ధంగా ఆ బిల్లులను సభలో ఆమోదించుకున్నారని, వాటిని వెనక్కి పంపాలని విన్నవించాయి. ఈ మేరకు విపక్షాల తరఫున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ బుధవారం సాయంత్రం రాష్ట్రపతితో భేటీ అయ్యారు. విపక్షాల తరఫున వినతపత్రం సమర్పించారు.

రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆజాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లులు తీసుకొచ్చేముందు ఇతర పార్టీలను గానీ, రైతు సంఘాల నేతలను గానీ కేంద్రం సంప్రదించలేదని చెప్పారు. బిల్లులను ఆమోదించే క్రమంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. దీనిపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించామన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఆమోద పొందిన బిల్లులను వెనక్కి పంపాలని కోరినట్లు తెలిపారు.

ఇటీవల మూడు కీలక బిల్లులను కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) బిల్‌ 2020, ది ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆఫ్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ బిల్‌ 2020, నిత్యావసరాల చట్టం (సవరణ) బిల్లు 2020ని ఇరు సభలూ ఆమోదించాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. ఇందులో రెండు బిల్లులపై చర్చ సందర్భంగా ఆదివారం రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో అందుకు కారణమైన 8 మంది ఎంపీలను రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సస్పెండ్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని