రోజుకి పది లక్షల కరోనా పరీక్షలు: ప్రధాని మోదీ - PM Inaugurates 3 Corona Testing Labs
close
Published : 27/07/2020 19:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోజుకి పది లక్షల కరోనా పరీక్షలు: ప్రధాని మోదీ

దిల్లీ:  దేశంలో కరోనా పరీక్షల నిర్వహణ సామర్ధ్యం పది లక్షలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం 1300 పరీక్షా కేంద్రాలు రోజుకి 5 లక్షల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్లనే కరోనాపై పోరులో భారత్‌ మెరుగైన స్థితిలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన కరోనా పరీక్షా కేంద్రాలను నోయిడా, ముంబయి, కోల్‌కతాలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. 

‘‘ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని కొత్త హైటెక్ పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి రావడం కరోనాపై దేశం కొనసాగిస్తున్న పోరుకు మరింత బలాన్ని చేకూర్చాయి. వీటి ద్వారా ప్రతి రోజు అదనంగా మరో 10 వేల పరీక్షలు చేయగలిగే సామర్ధ్యం చేకూరింది. ఈ పరీక్షా కేంద్రాలను కేవలం కరోనా టెస్టుల కోసం మాత్రమే కాకుండా డెంగ్యూ, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ వంటి పలు రకాల టెస్టుల నిర్వహరణకు కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని వసతులతో 11 వేల కరోనా కేంద్రాలు, 11 లక్షల ఐసోలేషన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి ’’ అని ప్రధాని తెలిపారు. 

కరోనాపై దేశం సాగిస్తున్న పోరులో వైద్యారోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎమ్‌లు, అంగన్‌వాడీ, ఇతర సిబ్బంది పాత్రను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు. వారంతా వేగంగా శిక్షణ పొంది కరోనాపై పోరులో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఒకానొక దశలో భారత్‌లో ఒక్క పీపీఈ కిట్‌ కూడా తయారు చేసే సామర్ధ్యం లేదని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పీపీఈ కిట్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉందని అన్నారు. గత ఆరు నెలలుగా సుమారు 1200 కంపెనీలు పీపీఈ కిట్లను, ఎన్‌95 మాస్కులను తయారు చేస్తున్నాయని తెలిపారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని