చైనా, పాక్‌లతో యుద్ధం.. తేదీలు ఫిక్స్‌! - PM has decided date of war with China Pak says UP BJP president
close
Updated : 26/10/2020 09:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా, పాక్‌లతో యుద్ధం.. తేదీలు ఫిక్స్‌!

యూపీ భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌

బల్లియా: పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాలతో ఎప్పుడు యుద్ధానికి దిగాలన్న దానిపై ప్రధాని మోదీ పూర్తి స్పష్టతతో ఉన్నారని, ఈ మేరకు  తేదీలు కూడా ఖరారయ్యాయని ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన ఇదే తరహాలో మాట్లాడారు. భారత్‌-చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలూ తమ సైన్యాలను భారీగా మోహరించాయంటూ వార్తల్లోకెక్కారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370 రద్దు తదితర సమయాల్లో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అంతే వేగంగా నిర్ణయాలు ఉంటాయని స్వతంత్రదేవ్‌ చెప్పుకొచ్చారు.

‘‘రామమందిరం, ఆర్టికల్‌ 370 రద్దు అంశాలపై నిర్ణయం తీసుకున్న మాదిరిగానే పాకిస్థాన్‌, చైనాలతో ఎప్పుడు యుద్ధం జరుగుతుందో ప్రధాని మోదీ నిర్ణయించారు’’ అంటూ ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. భాజపా ఎమ్మెల్యే సంజయ్‌ యాదవ్‌ ఇంట్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వతంత్ర దేవ్‌ వెళ్లి ఈ వ్యాఖ్యలు చేయగా.. సంబంధిత వీడియోను ఆ ఎమ్మెల్యే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అంతే కాకుండా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఉగ్రవాదులతో కలిసి పని చేస్తున్నట్లు స్వతంత్రసింగ్ వీడియోలో పేర్కొన్నారు. మరోవైపు ఇవాళ సిక్కిం పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వీలైనంత త్వరగా సరిహద్దు ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పి, శాంతిని స్థాపించాలని భారత్‌ కోరుకుంటోందని చెప్పారు. అలాగని అంగుళం భూమిని కూడా వదులుకునేందుకు భారత్‌ సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దేవ్‌ సింగ్‌ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని