పవన్‌ బర్త్‌డే: మరో రెండు సర్‌ప్రైజ్‌లు - POWER STAR pawan kalyan Harish Shankar movie Update
close
Published : 02/09/2020 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ బర్త్‌డే: మరో రెండు సర్‌ప్రైజ్‌లు

హైదరాబాద్‌: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక ఆయన నటిస్తున్న ‘వకీల్‌సాబ్’ చిత్రం నుంచి మోషన్‌పోస్టర్‌ విడుదల కాగా,  క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ డ్రామాకు సంబంధించి ప్రీలుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడు మరో రెండు సర్‌ప్రైజ్‌లు వచ్చేశాయి.

పవన్‌-హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. హార్లీడేవిడ్‌ సన్‌ బైక్‌పై పెద్ద బాలశిక్ష ఫొటో, గులాబీ పువ్వు ఉండగా, ఇండియా గేట్‌ బ్యాగ్రౌండ్‌పై PSPK28  అని రాసి ఉంది. సర్దార్‌ వల్లభబాయ్‌ పటేల్‌, సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రాలు కనిపిస్తున్నాయి. ‘ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను నవీన్‌ ఎర్నేని, వై.రవి శంకర్‌ నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చనున్నారు.

ఇక ఈ చిత్రంతో పాటు, పవన్‌-సురేందర్‌రెడ్డి కలయికలో మరో చిత్రం కూడా రానుంది. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత రామ్‌ తాళ్లూరి, రచయిత వక్కంతం వంశీ అధికారికంగా ప్రకటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని