పాకిస్థాన్‌లో టిక్‌టాక్‌కు బిగ్‌ షాక్‌! - PTA bans TikTok
close
Published : 10/10/2020 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాకిస్థాన్‌లో టిక్‌టాక్‌కు బిగ్‌ షాక్‌!

ఇస్లామాబాద్‌: యువతలో మంచి క్రేజ్‌ సంపాదించిన టిక్‌టాక్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే భారత్‌, అమెరికా దేశాలు ఈ యాప్‌పై నిషేధం విధించగా.. తాజాగా పాకిస్థాన్‌లో కూడా ఎదురుదెబ్బ తగిలింది. టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ పాకిస్థాన్‌ టెలీకమ్యూనికేషన్‌ అథారిటీ (పీటీఏ) ఆదేశాలు జారీచేసింది. ఈ యాప్‌లో అనైతిక/అసభ్యకరమైన సమాచారానికి వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటీఏ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్‌ కంటెంట్‌ను నియంత్రించేందుకు సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సమయం ఇచ్చినప్పటికీ ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిషేధం విధించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. యాప్‌లో అభ్యంతరకరమైన డేటాను తొలగించాలని ఆదేశిస్తూ జులై చివరిలోనే హెచ్చరిక చేసినట్టు పేర్కొన్నారు. అయితే, పీటీఏ ప్రకటించిన నిర్ణయంపై టిక్‌టాక్‌ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. పాకిస్థాన్‌లో ఈ యాప్‌నకు దాదాపు 39 మిలియన్ల డౌన్‌లోడ్‌లు ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని