కుల్‌భూషణ్‌ కేసులో భారత్‌‌ డిమాండ్‌కు పాక్‌ నో - Pak dismisses Indian demand in Kulbhushan Jadhav case
close
Updated : 11/09/2020 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుల్‌భూషణ్‌ కేసులో భారత్‌‌ డిమాండ్‌కు పాక్‌ నో

న్యూదిల్లీ: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో పోరాడటానికి తమ న్యాయవాదులను అనుమతించాలన్న భారత్‌ డిమాండ్‌ను పాకిస్థాన్‌ కోర్టు కొట్టివేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా గురువారం వెల్లడించింది.

‘జాదవ్‌ కేసులో భారత్‌ నుంచి ఏవిధమైన డిమాండ్లను పాక్‌  ఎప్పటికీ అంగీకరించదు’ అని పాక్‌ విదేశాంగ శాఖ కార్యాలయ ప్రతినిధి జహీద్‌ హఫీజ్‌ చౌదరి తెలిపారు. పాకిస్థాన్‌ కోర్టుకు సహకరించడం తప్ప భారత్‌కు వేరే మార్గం లేదని, స్థానిక న్యాయవాదులను మాత్రమే బెంచ్‌ ముందుకు అనుమతించనున్నట్లు జహీద్‌ పేర్కొన్నారు. భారత్ డిమాండ్లకు అనుగుణంగా పాకిస్థాన్‌ చట్టాలలో ఏవైనా సడలింపులు పరిశీలిస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే జాదవ్ తరఫు న్యాయవాదిని నియమించడానికి భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) ఇటీవలే పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణను  అక్టోబర్ 3 వరకు వాయిదా వేసింది. జాదవ్‌పై తన ఉత్తర్వులను భారత్‌కు పంపాలని పాకిస్థాన్ ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని