పీఎస్‌ఎల్‌ కన్నా ఐపీఎల్‌ ఉత్తమం - Pakistan Former bowler Wasim Akram Feels IPLbetter than PSL and he praises BCCI
close
Published : 31/07/2020 12:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీఎస్‌ఎల్‌ కన్నా ఐపీఎల్‌ ఉత్తమం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను పొగిడిన వసీం అక్రమ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నిర్వహించే పీఎస్‌ఎల్‌ కన్నా బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్‌ టోర్నీయే అతి పెద్దదని ఆ జట్టు దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌ అన్నాడు. మాజీ క్రికెటర్‌ తన్వీర్‌ అహ్మద్‌తో యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన వసీం ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఈ మెగా టోర్నీని ఘనంగా నిర్వహిస్తోందని, భారీ మొత్తం వెచ్చిస్తోందని చెప్పాడు. పీఎస్‌ఎల్‌తో పోలిస్తే ఐపీఎల్‌ అత్యుత్తమమని ప్రశంసించాడు.

‘ఐపీఎల్‌ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. అదే విధంగా అధిక ఆదాయం లభిస్తోంది. అలా వచ్చిన డబ్బును బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌ కోసం ఉపయోగిస్తోంది. దాంతో భారత్‌లోని ప్రతిభగల యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. ఐపీఎల్‌లో ఆటగాళ్లను కొనేందుకు ఒక జట్టు బడ్జెట్‌ రూ.60-80 కోట్లు ఉంటుంది. అది పీఎస్ఎల్‌ కన్నా రెండింతలు ఎక్కువ. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లు వ్యక్తిగత కోచ్‌లను ఏర్పాటు చేసుకుంటారు. తద్వారా పూర్తిస్థాయిలో సన్నద్ధమై.. ఆత్మవిశ్వాసంతో ఆడతారు’ అని అక్రమ్‌ వివరించారు. అక్రమ్‌ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని