అలాంటివి పాక్‌ క్రికెట్‌ను దెబ్బతీస్తాయి - Pakistan former captain and chief selector Inzamam Ul Haq opines that issues like Amirs incident will get negative impact on their Team
close
Published : 25/12/2020 19:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలాంటివి పాక్‌ క్రికెట్‌ను దెబ్బతీస్తాయి

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో మాజీ కెప్టెన్‌, ఛీఫ్‌ సెలెక్టర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ స్పందించాడు. అలాంటి అంశాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పాడు. గురువారం మీడియాతో మాట్లాడిన ఇంజమామ్‌.. ఆమిర్‌ తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నాడు. ఎవరితోనైనా సమస్యలు ఉంటే హెడ్‌ కోచ్‌తో మాట్లాడాలని, అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే జట్టు యాజమాన్యంతో చర్చించాలని సూచించాడు.

పాక్‌ క్రికెట్‌ బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌తో అతడికి విభేదాలున్నాయని తెలిసిందని మాజీ సారథి చెప్పాడు. అయితే, వకార్‌తో పాటు హెడ్‌ కోచ్‌ మిస్బాఉల్‌ హక్‌తో సైతం తనకు విభేదాలు ఉన్నాయని ఆమిర్‌ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. వాళ్లిద్దరూ తన రిటైర్మెంట్‌కు కారణమని, ఏడాదిగా జట్టులో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆరోపించాడు. ఈ నేపథ్యంలో అతడు తీసుకున్న నిర్ణయం పాక్‌ బౌలింగ్‌ యూనిట్‌పై ప్రభావం చూపదని, కానీ అది జట్టు ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని ఇంజమామ్‌ ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇవీ చదవండి..

ధోనీ చెప్పినట్లే చేశాడు.. ఆశ్చర్యపోయా 

టీమ్‌ఇండియా రెండో టెస్టు జట్టు ఇదే..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని