పాక్‌‌ క్వాడ్ కాప్టర్‌ను కూల్చేసిన సైన్యం  - Pakistan quadcopter shot down by Indian Army
close
Published : 25/10/2020 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌‌ క్వాడ్ కాప్టర్‌ను కూల్చేసిన సైన్యం 

దిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్‌ దుశ్చర్యలను భారత సైన్యం ఎండగట్టింది. నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలో ఎగురుతున్న పాక్‌కు చెందిన క్వాడ్‌ కాప్టర్‌ను భద్రతాబలగాలు కూల్చివేశాయి. ఈ ఘటన శనివారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని కేరన్ సెక్టార్‌ వద్ద చోటుచేసుకుంది. చైనా కంపెనీ తయారు చేసిన డీజీఐ మావిక్‌ 2 ప్రో మోడల్‌కు చెందిన పాకిస్థాన్‌ క్వాడ్‌కాప్టర్‌ భారత భూభాగంలో చక్కర్లు కొడుతుండగా  కూల్చివేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల భారీగా పేలుడు పదార్థాలు, ఏకే 47 రైఫిల్స్‌తో కేరన్‌ సెక్టార్‌ ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు పాకిస్థాన్‌ చేసిన దుష్టపన్నాగాలను సైన్యం దీటుగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు.. సెప్టెంబర్‌లో ఆర్మీచీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణె రెండు రోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటనకు వెళ్లిన సందర్భంలో కూడా సరిహద్దు వెంబడి బలగాల మోహరింపు, సన్నద్ధతపై కీలకంగా సమీక్షించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని