‘D’ అంటే డీన్‌జోన్స్‌.. - Pakistan super league players pays tributes for Dean Jones who died in India during IPL
close
Updated : 15/11/2020 14:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘D’ అంటే డీన్‌జోన్స్‌..

దివంగత క్రికెటర్‌కు పీఎస్‌ఎల్‌లో నివాళులు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మార్చిలో అర్ధాంతరంగా ఆగిపోయిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది. అప్పుడు లీగ్‌ దశ పూర్తికాగా కేవలం ప్లేఆఫ్స్‌ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్‌ కూడా పూర్తవడంతో దాయాది దేశంలో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం తొలి క్వాలిఫయర్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ x కరాచి కింగ్స్‌ తలపడ్డాయి. మరో మ్యాచ్‌లో లాహోర్‌ కలందార్స్‌ x పెషావర్‌ జాల్మీ పోటీపడ్డాయి. అయితే, మ్యాచ్‌కు ముందు ముల్తాన్‌, కరాచీ ఆటగాళ్లు ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్‌ డీన్‌జోన్స్‌కు నివాళులర్పించారు.

ఐపీఎల్‌ సమయంలో ఓ క్రీడాఛానల్‌తో కలిసి పనిచేసేందుకు జోన్స్‌ భారత్‌కు వచ్చారు. సెప్టెంబర్‌ 19న యూఏఈలో మెగా టీ20 లీగ్‌ ప్రారంభమవ్వగా అదే నెల 24న  ముంబయిలోని ఓ స్టార్‌హోటల్‌లో ఆయన గుండెపోటుకు మృతిచెందాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ పునఃప్రారంభమైన వేళ ఆ రెండు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అతడికి నివాళులర్పించారు. D అనే ఆకారంలో నిలబడి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా, ఈ వీడియోను పీఎస్‌ఎల్‌ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో క్రికెట్‌ అభిమానులు పెద్ద ఎత్తున లైక్‌ చేశారు. కాగా, డీన్‌‌ 1984 నుంచి 1992 వరకు 8 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. మొత్తం 52 టెస్టులు, 164 వన్డేలాడాడు. టెస్టుల్లో 46.55 సగటుతో 3,631 పరుగులు చేయగా, వన్డేల్లో 44.61 సగటుతో 6,068 పరుగులు సాధించాడు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని