రామమందిరంపై పాక్‌ స్పందన ఆశ్చర్యపర్చలేదు - Pakistan to refrain from interfering in Indias affairs
close
Published : 06/08/2020 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామమందిరంపై పాక్‌ స్పందన ఆశ్చర్యపర్చలేదు

దిల్లీ: అయోధ్యలో రామ మందిర భూమిపూజ జరిగిన తరుణంలో దాయాది దేశం పాకిస్థాన్‌ చేసిన వ్యాఖ్యలను భారత్ గురువారం తీవ్రంగా ఖండించింది. మతపరంగా రెచ్చగొట్టే తీరును కట్టిపెట్టాలంది. భారత్ వ్యవహారాల్లో తలదూర్చకుండా దూరంగా ఉండాలంటూ విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పాక్‌కు సూచించారు. 
‘భారత్ అంతర్గతమైన అంశంపై ఇస్లామిక్ రిపబ్లిక్‌ ఆఫ్ పాకిస్థాన్ విడుదల చేసిన మీడియా ప్రకటనను గమనించాం. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, మతపరంగా రెచ్చగొట్టే తీరుకు దూరంగా ఉండాలి. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, స్వదేశానికి చెందిన మైనార్టీ వర్గాలకు మతపరమైన హక్కులను దూరం చేసే దేశం నుంచి వచ్చిన ఈ స్పందన ఆశ్చర్యపర్చలేదు. అయినా కూడా అలాంటి వ్యాఖ్యలు తీవ్ర విచారకరం’ అని శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన నేపథ్యంలో బుధవారం పాకిస్థాన్‌ విమర్శలు చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని