మనీలాండరింగ్..పాక్‌ బ్యాంకుల హస్తం! - Pakistani banks named in global money laundering list
close
Published : 22/09/2020 22:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనీలాండరింగ్..పాక్‌ బ్యాంకుల హస్తం!

ఇస్లామాబాద్: మనీలాండరింగ్ వ్యవహారంలో అంతర్జాతీయ బ్యాంకుల పాత్రపై జరిపిన దర్యాప్తులో పాకిస్థాన్‌ గుట్టు బయటపడింది. అందులో ఆరు పాకిస్థానీ బ్యాంకుల హస్తం ఉన్నట్లు, 2.5 మిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. ది ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే), బజ్‌ఫీడ్ న్యూస్ జరిపిన దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్‌ బ్యాంకులకు సంబంధించి మనీ లాండరింగ్ కోసం సుమారు 29 లావాదేవీలు జరిగి ఉండొచ్చని ఆ సంస్థలు తమ నివేదికలో వెల్లడించాయి.  కాగా, అలీడ్ బ్యాంక్‌, యునైటెడ్ బ్యాంక్ లిమిటెడ్(యూబీఎల్‌), హబీబ్ మెట్రోపాలిటన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆల్ఫాలా, స్టాండర్ట్ ఛార్టర్డ్ బ్యాంక్‌ల ద్వారా 2011 నుంచి 2012 మధ్యకాలంలో  ఈ మొత్తం లావాదేవీలు జరిగినట్లు తెలుస్తుంది. 

యూఎస్‌ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇంటిలిజెన్స్‌ యూనిట్ అయిన ఫైనాన్సియల్ క్రైమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నెట్‌వర్క్‌కు అంతర్జాతీయ బ్యాంకులు 2100 అనుమానాస్పద నివేదికలను దాఖలు చేశాయని ఆ దర్యాప్తులో వెల్లడైంది. అనుమానాస్పద చెల్లింపుల్లో భాగంగా అంతర్జాతీయ బ్యాంకులు 1999 నుంచి 2017 మధ్యలో 170 దేశాల్లోని ఖాతాదారులకు చెల్లింపులు చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ బ్యాంకుల బండారం బయటపడింది. ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకులు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఆ దేశ తీరు దీంతో మరోసారి బయటకొచ్చింది. ఉగ్రవాదులు, మనీ లాండరింగ్‌కు సహకరిస్తుందన్న కారణంతో  ఫ్రాన్స్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ చెందిన గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్‌ ఇప్పుడు బ్లాక్‌ లిస్ట్‌లో పడకుండా ఉండేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో ఈ నివేదిక బయటకు రావడం గమనార్హం.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని