పాక్‌ ప్రభుత్వ స్వాధీనంలోకి రాజ్‌కపూర్‌ ఇల్లు - Pakistans Khyber Pakhtunkhwa to purchase houses Raj Kapoor and Dilip Kumar
close
Published : 29/09/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ ప్రభుత్వ స్వాధీనంలోకి రాజ్‌కపూర్‌ ఇల్లు

దిలీప్‌ కుమార్‌ నివాసం సైతం..

పెషావర్‌: బాలీవుడ్‌ దిగ్గజ నటులైన రాజ్‌ కపూర్‌, దిలీప్‌ కుమార్‌ పూర్వీకుల ఇళ్లను పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పంఖ్తుంక్వా రాష్ట్ర ప్రభుత్వం సొంతం చేసుకోనుంది. ఈ మేరకు వాటికయ్యే ఖరీదు ఎంతో చెప్పాలంటూ అక్కడి పురావస్తు శాఖ స్థానిక అధికారులకు లేఖ రాసింది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ ఇళ్లను చారిత్రక సంపదగా పరిరక్షించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఇప్పటికే వాటిని జాతీయ వారసత్వ సంపదలుగా గుర్తించి తగిన నిధులు కేటాయించింది.

రాజ్‌కపూర్‌ పూర్వీకులు నిర్మించిన కపూర్‌ హవేలీ పెషావర్‌లోని ఖిస్సా ఖ్వానీ బజార్‌లో ఉంది. 1918-1922 మధ్య దీన్ని ఆయన తాత దీవాన్‌ బషేశ్వరనాథ్‌ కపూర్‌ నిర్మించారు. రాజ్‌కపూర్‌ ఇక్కడే జన్మించారు. అదే ప్రాంతంలో ఉన్న దిలీప్‌ కుమార్‌ పూర్వీకుల ఇంటిని సైతం 100 ఏళ్ల క్రితం నిర్మించారు. 2014లో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం దీన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రస్తుతం ఈ రెండు ఇళ్లను ఖైబర్‌ పంఖ్తుంక్వా రాష్ట్ర పురావస్తు శాఖ తమ అధీనంలోకి తీసుకొని నిర్వహించనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని