సింగర్ల కష్టాలపై సాంగ్‌.. అమితాబ్‌ ట్వీట్‌ - Palash Sen launches new song as part of India for Indie campaign
close
Published : 27/08/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సింగర్ల కష్టాలపై సాంగ్‌.. అమితాబ్‌ ట్వీట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది ఉద్యోగాలు పోయాయి. చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎంతోమంది రోడ్డున పడ్డారు. ఈ జాబితాలో స్వతంత్ర సంగీత దర్శకులు, పాటల రచయితలు, గాయకులూ ఉన్నారు. లాక్‌డౌన్‌ వేళ కచేరీలు, ఇతర సంగీత కార్యక్రమాలు రద్దవ్వడం, వేడుకలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో వీరి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. వారి కష్టాలను తెలిపేందుకు ఇండియా పాప్‌ బ్యాండ్‌ ‘యుఫోరియా’ తాజాగా ఓ పాటను విడుదల చేసింది. ప్రముఖ గాయకుడు పలాష్‌ సేన్‌ ఈ గీతాన్ని ఆలపించారు.

మ్యూజిక్‌ ఇండస్ట్రీకి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ఈ పాటను విడుదల చేశారు. ‘లడాయి’ అంటూ 4.18 నిమిషాల పాటు సాగే ఈ పాటలో సుమారు 76 మంది సంగీత విభాగానికి చెందిన ఆర్టిస్టులు ప్లకార్డులతో దర్శనమిచ్చారు. ఈ పాటను ప్రశంసిస్తూ ప్రముఖ నటుడు అమితాబ్‌ ట్వీట్‌ చేశారు. ఈ కరోనా మహమ్మారి వేళ గాయకుల కష్టాలను తెలియజెప్పేలా ఉందని ప్రశంసించారు. కరోనా కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్న సంగీత విభాగానికి చెందిన వ్యక్తులను ఆదుకోవాలని పలాష్‌ సేన్‌ పోరాడుతున్నారు. ఇందుకోసం ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీని కూడా ఓ పరిశ్రమగా గుర్తించాలని, వారికి ఆర్థిక ప్యాకేజీ అందించాలని కోరుతూ ఛేంజ్‌.ఓఆర్జీలో ‘ఇండియా ఫర్‌ ఇండీ’ పేరుతో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. సుమారు 50 వేల మందికి పైగా ఈ పిటిషన్‌పై సంతకం చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని