బడికెళ్లాలంటే వారి అనుమతి తప్పనిసరి - Parents written consent mandatory for school going children
close
Updated : 05/10/2020 20:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడికెళ్లాలంటే వారి అనుమతి తప్పనిసరి

ఆన్‌లైన్‌ తరగతులు ఎంత సేపంటే..

దిల్లీ: కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ అనంతరం విద్యాసంస్థలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. కంటెయిన్‌మెంట్‌ జోన్‌ పరిధిలో లేని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను అక్టోబర్‌ 15 తరువాత తిరిగి తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. అయితే వీటిని ఎప్పుడు తెరవాలనే నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు వదిలివేసింది. అయితే విద్యార్థులు పాఠశాల తరగతులకు హజరయ్యేందుకు వారి తల్లితండ్రుల లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. హోంశాఖ నిర్దేశాల ప్రకారం తల్లితండ్రులు  రాతపూర్వకంగా అనుమతించిన విద్యార్థులు మాత్రమే పాఠశాలలో తరగతులకు హాజరయ్యేందుకు వీలు కలుగుతుంది. అయితే హాజరు కోసం విద్యార్థులపై  నిర్బంధం ఉండరాదని కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ ఓ ప్రకటనలో వివరించారు.

అంతేకాకుండా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై ప్రభుత్వ మార్గదర్శకాలను మంత్రి వివరించారు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు కాల వ్యవధిని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. నర్సరీ విద్యార్థులకు 30 నిముషాలు, 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఒకటిన్నర గంటలు కాగా.. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అత్యధికంగా మూడు గంటలని ఆయన తెలిపారు. ఇక ఒక్కో పీరియడ్‌ కాల వ్యవధి గరిష్ఠంగా 45 నిమిషాలు మాత్రమే ఉండాలని ఆయన సూచించారు. విద్యార్థులు లాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లపై ఆన్‌లైన్‌ తరగతులకు హాజరౌతున్న నేపథ్యంలో.. వారి కళ్లకు శ్రమ కలుగకుండా వారి గదుల్లో గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూడాలని ఆయన తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు.

* స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాగ్రత్తల విషయంలో నిర్ణయం తీసుకోవాలి.

* పాఠశాలల్లో తప్పనిసరిగా గదులు, ఫర్నీచర్‌, విద్యా సామగ్రి, నీటి ట్యాంకులు, శౌచాలయాలు, ల్యాబ్‌లు శుభ్రంగా ఉంచాలి.

* భద్రతా ప్రమాణాలు తప్పని సరిగా పాటించేందుకు పోస్టర్లు, సంక్షిప్త సందేశాల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలి.

* విద్యార్థులు, ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురైనప్పుడు వారు ఇంట్లో విశ్రాంతి తీసుకునేలా హాజరు విషయంలో వెసులుబాటు కల్పించాలి.

* తల్లిదండ్రుల రాత పూర్వక అనుమతితో మాత్రమే విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలి.

* విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు మొగ్గు చూపితే వాటినే ఎంచుకునేందుకు ప్రోత్సహించాలి.

* విద్యార్థులు ఇప్పుడు తిరిగి పాఠశాలకు చేరుకునేందుకు ప్రక్రియ వీలైనంత సులభంగా ఉండాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని