ఆ సన్నివేశాలను తొలగించాం : పరుచూరి  - Paruchuri Gopala Krishna Talks About Lorry Driver Movie
close
Published : 27/12/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సన్నివేశాలను తొలగించాం : పరుచూరి 


ఇంటర్నెట్ డెస్క్‌: బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం ‘లారీ డ్రైవర్’. 1990లో విడుదలైన ఈ చిత్రం ఇటీవలే 30ఏళ్లు పూర్తి చేసుకున్న సంద్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను దర్శకులు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’లో పంచుకున్నారు.  ‘‘బాలయ్య బాబు ఎన్నో చిత్రాలకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఎప్పుడైనా ఆయనే కథ అడిగేవారు. రెండు కథలు చెప్పాం. ఒకటి ‘నిప్పురవ్వ’, మరొకటి ‘వంశానికొక్కడు’. కానీ, ఈ రెండు జరగలేదు. ‘లారీ డ్రైవర్’, ‘బొబ్బిలి సింహం’ చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రం కంటే ముందు ‘వంశానికొక్కడు’ కథను గోపాల్‌కి చెప్పాను. అప్పుడాయన.. ‘కథ బాలేదు గురువుగారు’ అన్నారు. అది కాదు, బాబుకి కూడా ఒకసారి వినిపిస్తా అని అంటే ‘వద్దండి. ఇంకేదైనా విందాం. ప్లీజ్’ అని అన్నారు. ఇక ఆయన అలా చెప్పేసరికి నేను సరే అన్నాను. అదే సమయంలో ఆంజనేయ పుష్పానంద్ ‘లారీ డ్రైవర్‌’ కథ వినిపించటంతో ఈ చిత్రాన్ని తీశారు. ఆ తర్వాత 1996లో చాలా ఆలస్యంగా శరత్ దర్శకత్వంలో ‘వంశానికొక్కడు’ చిత్రం తెరకెక్కింది’’ అని ఆయన చెప్పారు.

‘‘నేను వేరే సినిమా షూటింగ్‌లో ఉన్నాను. వీళ్లందరు ఈ చిత్రం షూటింగ్ కోసం రైల్లో వెళుతున్నారు. ముందుగానే ఈ చిత్రంలో బాబు మోహన్‌ను పెట్టుకోవాలనుకున్నాం. కానీ, ఈ కథలో ఆయనది చాలా చిన్న పాత్ర. అప్పటికే ఆయన అద్భుతమైన కమెడియన్‌. ఈ విషయం గురించి రైల్లో చర్చ నడుస్తోంది. అప్పుడు బాబు మోహన్‌ ఫోన్‌ చేసి ‘సర్, నేను రావాలా? వద్దా? నా పాత్ర ఉందా?’ అని అడిగారు. దాంతో ముందు ఆయనను రమ్మని చెప్పి, అప్పటికప్పుడు వీరందరూ కలిసి కూర్చొని ఓ అద్భుతమైన పాత్రను బాబు మోహన్‌కు ఇచ్చారు. ఆయన నటించిన ఈ చిన్న పాత్రే ఎంత ముఖ్యం అయింది అంటే క్లైమాక్స్‌లో బాబు మోహన్‌ ఆ రహస్యం చెప్తే కానీ లారీ డ్రైవర్ గెలవడు. అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది’’ అని ఆయన అన్నారు.

‘‘ఈ చిత్రం సమయంలో విచిత్రం ఏమిటంటే శారద చేసిన కొన్ని సన్నివేశాలు కామెడీగా ఉన్నాయి. ఈ చిత్రంలో శారద కలెక్టర్ పాత్రలో నటించారు. ఆమె పాత్ర కామెడీగా ఉండటంతో కలెక్టర్ హోదాలో ఉండి ఇలా కామెడీగా ఉండటం ఏంటి అని ఆ సన్నివేశాలన్నింటినీ తొలగించి మళ్లీ రీషూట్ చేశాం. ఆమె పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చాం. అలాగే ఓ సూపర్‌ హిట్ చిత్రాన్ని బాలయ్య బాబుకు, మాకు అందించారు’’ అని ఆయన ముగించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని