జనవరి- మార్చి కల్లా కరోనా పూర్వస్థితికి ప్రయాణికుల రద్దీ - Passenger traffic to Corona reversal by January-March
close
Updated : 09/10/2020 04:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనవరి- మార్చి కల్లా కరోనా పూర్వస్థితికి ప్రయాణికుల రద్దీ

విమానయాన మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి

దిల్లీ: విమాన ప్రయాణికుల రద్దీ వచ్చే ఏడాది జనవరి- మార్చి కల్లా కరోనా ముందు నాటి స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. ప్రస్తుతమున్న పరిస్థితి ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన మే 25 నుంచి రోజువారి ప్రయాణికుల రద్దీ ఆరు రెట్లు పెరిగి 1,80,000కి చేరిందని పురి తెలిపారు. ఈ సంవత్సరం చివరికల్లా రోజువారీ 3,00,000కు పెరుగుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ప్రారంభానికి ముందు ఇంచుమించు ఇదే స్థాయిలో విమాన ప్రయాణికుల రద్దీ ఉండేదని తెలిపారు. కరోనా వైరస్‌ పరిణామాల నేపథ్యంలో మార్చి 25 నుంచి మే 24 వరకు దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని