‘‘తన గుండెచప్పుడు ఎప్పుడూ జనమే..’’ - Pawan Kalyan Birthday Wishes
close
Updated : 03/09/2020 04:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘తన గుండెచప్పుడు ఎప్పుడూ జనమే..’’

పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్‌: సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, ప్రముఖుల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ట్విటర్‌లో #HBDPawanKalyan అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు పవన్‌ జన్మదినం సందర్భంగా అభిమానులకు ఇప్పటికే మంచి సర్‌ప్రైజ్‌ కూడా వచ్చింది. పవన్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్‌తో అభిమానులు రెట్టింపు ఉత్సాహంలో మునిగిపోయారు.   

‘‘తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండె చప్పుడు ఎప్పుడూ జనమే. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే కల్యాణ్‌బాబు’’ అంటూ చిరంజీవి తన సోదరుడికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇద్దరూ కౌగిలించుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 

‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్‌ కల్యాణ్‌. మీరు చూపించే దయ, వినయం ఎల్లప్పుడూ కొత్తమార్పునకు స్ఫూర్తినిస్తుంది. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి’’ అని సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశారు. 

‘‘వేలల్లో ఒకరు నటుడిగా కావాలని కలలు కంటారు. కానీ, మిలియన్‌ మందిలో ఒకరు మాత్రమే అవుతారు. ఆ నటీనటులలో కొద్దిమంది మాత్రమే సూపర్ స్టార్‌గా మారగలరు. సినీ రంగంలో అనూహ్యమైన ఎత్తుకు ఎదిగిన మీరు ఇప్పటికీ మీ మనసు చెప్పిందే చేస్తున్నారు. ఇది అద్భుతం. హ్యాపీ బర్త్‌డే పవన్‌ కల్యాణ్‌ సర్‌’’: దర్శకుడు బాబీ   

‘‘అద్భుతమైన వ్యక్తి, నా స్నేహితుడు పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఈ ఏడాది పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి’’: వెంకటేశ్‌ దగ్గుబాటి

‘‘పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’: అల్లు అర్జున్‌

‘‘బాక్సాఫీస్‌కా షేర్‌ ఆగయా.. హ్యాపీ బర్త్‌డే పవన్‌ కల్యాణ్‌ గారు. మిమ్మల్ని మళ్లీ సినిమాల్లో చూడటం ఆనందంగా ఉంది. పవర్‌ స్టార్‌, ప్రజల నాయకుడికి శుభాకాంక్షలు’’: దర్శకుడు మారుతి  

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ట్విటర్‌ ద్వారా పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పవన్‌ కల్యాణ్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. ఈ మేరకు పవన్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని