పరిహారం పెంచకుంటే ఉద్యమం : పవన్‌ - Pawan Kalyan visits NIVAR affected farmers in East Godavari district
close
Published : 03/12/2020 11:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరిహారం పెంచకుంటే ఉద్యమం : పవన్‌

మోపిదేవి: వైకాపా పాలనలో రైతులందరికీ న్యాయం జరగడం లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. నివర్‌ తుపాను బాధిత రైతులను వైకాపా నేతలు కనీసం పరామర్శించలేదని ఆరోపించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని పెదప్రోలులో ఆయన నివర్‌ బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారికి జరిగిన నష్టాన్ని జనసేనానికి వివరించారు. అనంతరం పవన్‌ అక్కడే మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చి ఇల్లు మునిగితే బాధితులకు రూ.10వేలు చొప్పున ఇచ్చారని.. ఇక్కడ ఎకరం పొలం మునిగితే ప్రభుత్వం అంతే ఇవ్వడం సరికాదన్నారు. ఆ పరిహారం రైతులకు ఏమాత్రం సరిపోదని చెప్పారు. ఎకరానికి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పరిహారం అందించాలని పవన్‌ డిమాండ్ చేశారు.

కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని పవన్‌ మండిపడ్డారు. పొలం యజమానులతో సమానంగా వారికీ పరిహారం అందించాలన్నారు. 48 గంటల్లోగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు తక్షణ సాయం కింద రూ.10వేలు అందించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు పరిహారం పెంచకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రైతులకు అండగా ఉంటామని.. వారికి న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తామని రైతులకు పవన్‌ భరోసా కల్పించారు. వైకాపా నేతల పుట్టినరోజు వేడుకలకు అడ్డురాని కరోనా.. నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు మాత్రం సాకుగా మారిందని ఆక్షేపించారు. శాసనసభలో పరస్పరం నిందలు చేసుకోవడం కట్టిపెట్టి, రైతులకు ఎలా న్యాయం చేయాలనే అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి..
పవన్‌ను కలిసిన వైకాపా ఎమ్మెల్యే తండ్రి
‘ఏపీ అమూల్‌’ ప్రారంభించిన సీఎం జగన్‌

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని