వరద బాధితులకు పవన్‌ రూ.కోటి విరాళం - Pawan donates to flood victims
close
Published : 21/10/2020 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరద బాధితులకు పవన్‌ రూ.కోటి విరాళం


హైదరాబాద్‌: వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్‌ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారీ వర్షాలు, వరదలు తోడయ్యాయన్నారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలకు రెండు తెలుగు రాష్ట్రాలు ఇబ్బందుల పాలవుతున్నాయని పవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

గత కొన్ని సంవత్సరాలుగా లేనంత వర్షపాతం దేశంలో నమైదైందని, తెలంగాణలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉందన్నారు. చాలా మంది జీవన విధానం చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఆస్తి నష్టం జరిగిందని.. గత కొన్ని దశాబ్దాలుగా నగర, పట్టణ ప్రణాళిక విభాగం సరిగా లేకపోవడం ఇందుకు కారణమని  అభిప్రాయపడ్డారు. జన సైనికులు, అభిమానులు, నాయకులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా పవన్‌ విజ్ఞప్తి చేశారు. అంతా కలిసికట్టుగా ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయం అని పేర్కొన్నారు. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని