హోం క్వారంటైన్‌లో పవన్‌ - Pawan in Home Quarantine
close
Updated : 11/04/2021 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హోం క్వారంటైన్‌లో పవన్‌

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా నిర్ధారణ కావడంతో  వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువమంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజులుగా ఆయన సిబ్బందిలో ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

  


 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని