Pawankalyan: త్వరలోనే మొదలు - Pawankalyan 28 Will be on sets soon
close
Updated : 07/09/2021 06:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawankalyan: త్వరలోనే మొదలు

Pawan kalyan-హరీష్‌శంకర్‌ రెండోసారి జట్టు కడుతున్న విషయం తెలిసిందే. ఈ కలయికలో సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్టు నిర్మాణ సంస్థ సోమవారం    సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. పవన్‌తో కలిసి దర్శకనిర్మాతలు చర్చలు జరుపుతున్న ఫొటోనీ పంచుకుంది. పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం ‘భీమ్లానాయక్‌’ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అది పూర్తయిన వెంటనే, ‘హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. ఆ వెంటనే హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహించనున్న సినిమా కోసం రంగంలోకి దిగుతారు. ఆ మేరకు నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాల్ని ప్రకటిస్తామని నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ప్రకటించారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: అయాంక బోస్‌, కళ: ఆనందసాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని