చిరు-పవన్‌ చిత్రాల్లో ఆ కామన్‌ పాయింట్‌ ఉంటుందా? - Pawans Vakeel Saab Chiru Lucifer Remake To Have This In Common
close
Published : 15/10/2020 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు-పవన్‌ చిత్రాల్లో ఆ కామన్‌ పాయింట్‌ ఉంటుందా?

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్నాళ్లూ రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్‌ వరుస చిత్రాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. మరోవైపు అన్నయ్య చిరంజీవి కూడా తమ్ముడి బాటలోనే ఒకదాని తర్వాత ఒక సినిమా చేస్తానంటూ దర్శకుల పేర్లను కూడా ప్రకటించారు. ‘ఆచార్య’ తర్వాత ఆయన ‘వేదాళం’ లేదా ‘లూసిఫర్‌’ రీమేక్‌ల్లో నటించనున్నారు. ఈ నేపథ్యంలో అన్నదమ్ముల సినిమాల్లో ఒక కామన్‌ పాయింట్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

కమర్షియల్‌ హంగులు లేకుండా తెలుగు చిత్రాలు అరుదు. ప్రేక్షకులు కూడా హైవోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లను చూడటానికి ఇష్టపడుతుంటారు. అయితే, పవన్‌ నటిస్తున్న ‘వకీల్‌సాబ్‌’(పింక్‌ రీమేక్‌), చిరు సందడి చేయనున్న ‘లూసిఫర్‌’ చిత్రాల మాతృక కథలో కథానాయికలకు చోటు లేదు. ఇప్పుడు ఈ రెండు చిత్రాల్లో కథానాయికలు కనిపిస్తారని టాక్‌. ‘వకీల్‌ సాబ్‌’లో పవన్‌కు జోడీగా శ్రుతి హాసన్‌ నటిస్తారని ఇప్పటికే టాక్‌ వినిపిస్తోంది. దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. మరోవైపు ‘లూసిఫర్‌’ రీమేక్‌ స్క్రిప్ట్‌ అంతా సిద్ధమైనట్లు సమాచారం. చిరు అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయట. తొలుత ఈ చిత్రానికి ‘సాహో’ సుజీత్‌ దర్శకుడిగా అనుకున్నా, ఇప్పుడు ఆ బాధ్యతలను వి.వి.వినాయక్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. నటీనటులు, సాంకేతిక బృందం ఇతర విషయాలపై చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. మలయాళ ‘లూసిఫర్‌’ను యథాతథంగా తీస్తారా? లేక కథానాయిక పాత్ర జోడిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని