బ్రిటన్‌లో పిల్లికీ కరోనా! - Pet cat becomes UKs first animal to test positive for COVID 19
close
Published : 27/07/2020 23:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రిటన్‌లో పిల్లికీ కరోనా!

లండన్‌: బ్రిటన్‌లో ఓ పిల్లికీ కరోనా సోకింది. పిల్లిలో కొవిడ్‌ లక్షణాలు కనిపించాయని యూకే ప్రధాన వెటర్నరీ అధికారి పేర్కొన్నట్లు అక్కడి ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 22న మార్జాలానికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం దానికి కరోనా సోకినట్లు తేల్చారు. బ్రిటన్‌లో కరోనా సోకిన మొదటి జంతువుగా ప్రభుత్వం ఈ కేసును గుర్తించింది. పిల్లి యజమానికి గతంలో కరోనా సోకగా అది పిల్లికి వ్యాపించినట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం యజమాని సహా మార్జాలం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని