విరాట్‌ కోహ్లీ, తమన్నాను అరెస్టు చేయాలి - Petition filed against Team India captain Virat kohli and actress Tamannah Bhatia
close
Updated : 31/07/2020 17:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విరాట్‌ కోహ్లీ, తమన్నాను అరెస్టు చేయాలి

మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ 

చెన్నై: టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, టాలీవుడ్‌ హీరోయిన్‌ తమన్నాను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో ఓ న్యాయవాది శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ యాప్స్‌కు సంబంధించి వీరిద్దరూ ప్రమోషన్‌ చేస్తున్నారని, వీరి ద్వారా యాప్‌ల నిర్వాహకులు యువతను పెడదోవ పట్టిస్తున్నారని చెన్నైకి చెందిన సూర్యప్రకాశ్‌ అనే న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని అత్యవసర విచారణ జరపాలని కోరారు. అలాగే ఆన్‌లైన్‌లో ఉన్న మోసపూరిత యాప్‌లను నిషేధించాలని కోరారు. యువకులు ఇలాంటి‌ యాప్‌లను వినియోగించి మోసపోతున్నారని, కొన్నిసార్లు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఇటీవల జరిగిన ఒక ఘటనను ఉటంకించారు. కాగా, ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని