రెండేళ్ల గరిష్ఠానికి పెట్రోల్‌ ధర - Petrol price at 2-yr high of Rs 83 per litre
close
Updated : 05/12/2020 15:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండేళ్ల గరిష్ఠానికి పెట్రోల్‌ ధర

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత పదహారు రోజుల్లో 13 సార్లు ధరలు పెరగడంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 83 మార్క్‌ దాటి రెండేళ్ల గరిష్ఠానికి చేరింది. అటు డీజిల్‌ ధర కూడా రూ. 73 దాటింది. 

అంతర్జాతీయంగా చమురుకు గిరాకీ పెరగడంతో దేశీయంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. దిల్లీలో శనివారం పెట్రోల్ ధరపై 27 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెరిగింది. దీంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 83.13, డీజిల్‌ ధర రూ. 73.32కు చేరింది. 2018 సెప్టెంబరు తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా ఉండటం మళ్లీ ఇప్పుడే. కరోనా తెచ్చిన సంక్షోభం నేపథ్యంలో ఆ మధ్య దాదాపు రెండు నెలల పాటు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు మళ్లీ నవంబరు 20 నుంచి పెరుగుతూ వస్తున్నాయి. గత 16 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 2.07, డీజిల్‌పై రూ. 2.86 పెరగడం గమనార్హం. 

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై సానుకూల వార్తలతో అంతర్జాతీయంగా చమురు ధరలు పుంజుకున్నాయి. బ్రెంట్‌ ముడిచమురు ధర 34శాతం పెరిగింది. దీంతో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ఇంధన కంపెనీలు కూడా రోజువారీ సవరణలు చేపట్టాయి. స

ఇదీ చదవండి..

వంటగ్యాస్ ధర భారీగా పెంపు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని