కోల్‌కతాలో కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాలు - Phase-3 clinical trial of Covaxin in Kolkata
close
Updated : 02/12/2020 22:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోల్‌కతాలో కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాలు

ప్రారంభించిన గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌

కోల్‌కత: ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు కోల్‌కతలో ప్రారంభమయ్యాయి. పశ్చిమబంగ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ బుధవారం ఈ ప్రయోగాలను ప్రారంభించారు. వివరాల ప్రకారం.. కరోనా నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం దేశీయంగా కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేస్తోంది.  ఈ మేరకు బుధవారం మూడోదశ రెగ్యులేటరీ ట్రయల్‌ను ఐసీఎంఆర్‌-ఎన్‌ఐసీఈడీలో ప్రారంభించారు. బెంగాల్ గవర్నర్‌  మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో ఒకటైన ఎన్‌ఐసీఈడీలో ప్రారంభిస్తున్న ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం సమర్థవంతంగా కరోనా వైరస్‌ను కట్టడి కృషిచేసిందన్నారు. ఉచిత ఆరోగ్యసేవలను అందించే ఆయుష్మాన్‌భారత్‌ పథకం చాలా మందికి సహాయాన్ని అందించిందన్నారు. కేంద్రం నిర్దేశించిన నిబంధనలకు బెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బెంగాల్‌లో ఈ పథకం ఇప్పటి వరకూ అమలు కాలేదు. కొవాగ్జిన్‌ తొలి రెండు దశల్లో జరిగిన క్లినికల్‌ ప్రయోగాలు విజయవంతంగా పూర్తైన  నేపథ్యంలో మూడో దశ ప్రయోగాలకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మంది వాలంటీర్లతో మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని