అందుకే డ్రంక్‌ అండ్‌‌ డ్రైవ్‌ నిలిపేశాం - Police Stop Dink-Drive
close
Published : 28/11/2020 23:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే డ్రంక్‌ అండ్‌‌ డ్రైవ్‌ నిలిపేశాం


 


ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనా పరిస్థితుల దృష్ట్యా కొన్ని నెలలుగా ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టడం లేదు. దాంతో మందుబాబులు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు మాట్లాడుతూ... తనిఖీల్లో ఉపయోగించే బ్రీత్‌ అనలైజర్‌ పరికరాన్ని నోటితో ఊదాల్సి ఉంటుందన్నారు. దానివల్ల కొవిడ్‌ వ్యాపించే అవకాశం ఉందన్నారు. అందుకే తనిఖీలను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. ప్రత్యామ్నాయ మార్గం కోసం ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రక్తపరీక్ష చేయటం ద్వారా ఆల్కహాల్ శాతాన్ని తెలుసుకోవచ్చని ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.‘‘ బ్రీతింగ్‌ అనలైజర్‌ ద్వారా కొవిడ్ వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నందునే తనిఖీలను తాత్కాలికంగా నిలిపివేశాం. ఇకపైన డాక్టర్ల వద్దకు పంపించి పరీక్షలు చేయించి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని విజయవాడ ట్రాఫిక్‌ ఏడీసీపీ సర్కార్‌ పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని