Nikhil: వైద్య అత్యవసరానికి అనుమతిస్తారనుకున్నా - Police Troubled Tollywood Young Hero Nikhil
close
Updated : 24/05/2021 08:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nikhil: వైద్య అత్యవసరానికి అనుమతిస్తారనుకున్నా

కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 10గంటల తర్వాత కారణం లేకుండా ఎవరు బయటకొచ్చినా పోలీసులు వారి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. కాగా.. కరోనా బాధితులకు సాయమందించేందుకు వెళ్తుండగా కథానాయకుడు నిఖిల్‌ను ఈపాస్‌ లేని కారణంగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయన ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ‘‘కొవిడ్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి మందులు అందించేందుకు ఉప్పల్‌ నుంచి కిమ్స్‌ మినిస్టర్స్‌ రోడ్డు మీదుగా కారులో బయలు దేరాను. బాధితుడి వివరాలతో పాటు వైద్యుడు రాసిన మందుల చీటీని చూపించినప్పటికీ పోలీసులు నన్ను అనుమతించలేదు. ఈ-పాస్‌ ఉండాల్సిందేనని చెప్పారు. అప్పటికీ నేను తొమ్మిది సార్లు ప్రయత్నించా. సర్వర్లు డౌన్‌ కావడం వల్ల నాకు ఈ-పాస్‌ దొరకలేదు. మెడికల్‌ ఎమర్జెన్సీకి అనుమతిస్తారని భావించి.. బయటకి వచ్చా’’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌పై హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం వెంటనే స్పందించింది. ‘‘డియర్‌ సర్‌, మీ లొకేషన్‌ ఒకసారి మాకు పంపించండి. స్థానిక అధికారులతో మాట్లాడి.. మీ సమస్య తీరుస్తాం’’ అని బదులిచ్చింది. తర్వాత నిఖిల్‌ అవసరమైన వివరాలను వారికి మెయిల్‌ చేయగా.. సమస్య పరిష్కారమైనట్లు సమాచారం.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని