ప్రియుడితో బ్రేకప్‌.. ప్రకటించిన పూజాగౌర్‌ - Pooja Gor confirms breakup with boyfriend Raj Singh Arora
close
Published : 18/12/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రియుడితో బ్రేకప్‌.. ప్రకటించిన పూజాగౌర్‌

పదేళ్ల బంధానికి స్నేహంతో ముగింపు పలికిన జంట

ముంబయి: ‘మన్‌ కీ అవాజ్‌ ప్రతిజ్ఞ’ 'సీరియల్‌తో పేరుపొందిన నటి పూజాగౌర్‌ తాజాగా తన బ్రేకప్‌ గురించి స్పందించారు. రాజ్‌ సింగ్‌ అరోడా అనే బుల్లితెర నటుడితో పదేళ్లుగా ప్రేమలో ఉన్న ఆమె.. తమ మధ్య చిన్న చిన్న గొడవలు చోటుచేసుకుంటున్నాయని గతేడాది ప్రకటించి అభిమానులను ఆందోళనకు గురిచేశారు. ఈ క్రమంలోనే గత కొన్నిరోజుల నుంచి వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తాజాగా సదరు వార్తలపై నటి పూజా స్పందించారు. పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు వెల్లడించారు.

‘2020.. ఈ ఏడాదిలో ఎన్నో మార్పులు జరిగాయి. అందులో కొన్ని మంచివి.. మరికొన్ని చెడువి. రాజ్‌తో నాకున్న రిలేషన్‌ గురించి గతకొన్నిరోజులుగా ఎంతోమంది ఎన్నోరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నేనూ-రాజ్‌ విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాం. మా జీవితాలకనుగుణంగా మేమిద్దరం విడిపోయినప్పటికీ మా మధ్య ఉన్న ప్రేమాభిమానాలు, గౌరవం.. జీవితాంతం ఉంటాయి. అలాగే నేను ఎప్పటికీ ఆయన విషయంలో సంతోషంగానే ఉంటాను. ఇకపై మేమిద్దరం మంచి స్నేహితులం. అది ఎప్పటికీ మారదు. ఈ విషయాన్నే మీ అందరికీ చెప్పాలనుకున్నాను.’ అని పూజాగౌర్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి

50 ఏళ్ల హీరో+19 ఏళ్ల హీరోయిన్‌.. ఇదో వింత

కోపంతో భర్తను కారు నుంచి దింపేసిన ప్రియాంక


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని