ఎన్టీఆర్‌తో స్ర్కీన్‌ పంచుకోవడం అద్భుతం: పూజాహెగ్డే - Pooja Hegde on working with Jr NTR in Aravinda Sametha Veera Raghava
close
Published : 21/11/2020 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌తో స్ర్కీన్‌ పంచుకోవడం అద్భుతం: పూజాహెగ్డే

ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్న బుట్టబొమ్మ

హైదరాబాద్‌: తారక్‌తో కలిసి స్ర్కీన్‌ పంచుకోవడం అద్భుతంగా అనిపించిందని బుట్టబొమ్మ పూజాహెగ్డే అన్నారు. ఈ ఏడాది ఆరంభంలో ‘అల.. వైకుంఠపురం’ చిత్రంతో మాంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆమె ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అరవింద సమేత’ సినిమా గురించి స్పందించారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌-పూజాహెగ్డే మొదటిసారి స్ర్కీన్‌ పంచుకున్నారు. 2018లో విడుదలైన ఈ చిత్రం గురించి పూజా మాట్లాడుతూ.. ‘‘అరవింద సమేత’.. ఎప్పటికీ నాకు ఓ ప్రత్యేకమైన చిత్రం. ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం ఈ సినిమాతో నాకు లభించింది. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది. మా ఇద్దరికీ ఎనర్జీ లెవల్స్‌ కొంచెం ఎక్కువగా ఉంటాయి. దానివల్లే ఆన్‌స్ర్కీన్‌లో మా జోడీ ప్రేక్షకులను అన్నివిధాలుగా అలరించింది. ఆన్‌స్ర్కీనే కాకుండా ఆఫ్‌స్ర్కీన్‌లో సైతం ఈ చిత్రం నాకెన్నో అనుభవాలను అందించింది. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వల్ల ఈ సినిమాలోని అరవింద పాత్రకు నేను డబ్బింగ్‌ చెప్పుకున్నాను.’ అని పూజాహెగ్డే ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

కె.రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో ప్రస్తుతం పూజాహెగ్డే నటిస్తున్నారు. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె ప్రభాస్‌కు జంటగా కనిపించనున్నారు. దీనితోపాటు అఖిల్‌ హీరోగా రానున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని