నా గుండెపగిలింది..అందుకే బ్రేక్‌: పూజాహెగ్డే - Pooja hegde reveales the reason behind break from bollywood after mohenjo daro
close
Published : 01/11/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా గుండెపగిలింది..అందుకే బ్రేక్‌: పూజాహెగ్డే

హైదరాబాద్‌: దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ విజయవంతంగా రాణిస్తున్న ముద్దుగుమ్మ పూజాహెగ్డే. ఈ భామ అశుతోష్‌ గోవారికర్‌ పీరియడ్‌ డ్రామా ‘మొహంజోదారో’ (2017)తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఊహించని రీతిలో అభిమానుల్ని నిరాశపరిచింది. ఆ తర్వాత పూజా తెలుగులో ‘దువ్వాడ జగన్నాథమ్‌’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. 2019లో ‘హౌస్‌ఫుల్‌ 4’తో తిరిగి బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అయితే హిందీలో రెండో సినిమాకు సంతకం చేయడానికి బ్రేక్‌ ఎందుకు తీసుకున్నారని తాజాగా మీడియా పూజాను ప్రశ్నించింది. దానికి ఆమె స్పందిస్తూ.. ‘మొహంజోదారో’ వైఫల్యం తనను తీవ్రంగా బాధించిందన్నారు.

‘నటీనటులకు మొదటి సినిమా ఎంతో ప్రాముఖ్యమైంది. అదే వారిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నా తొలి హిందీ సినిమా సమయంలో నేను ఒప్పందంపై పనిచేశా. అందుకే మరో సినిమాకు ఒప్పుకోలేదు. ఆ సినిమా ఫెయిల్‌ కావడంతో నా గుండె పగిలింది. ఆపై దక్షిణాది సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా అక్కడే ఆసక్తికరమైన సినిమాల్లో నటిస్తూ వచ్చా. నా రెండో సినిమా (హిందీలో) దృఢంగా, స్టడీగా ఉండాలని విరామం తీసుకున్నా. ‘హౌస్‌ఫుల్‌ 4’తో సక్సెస్‌ అందుకుని.. ఇవాళ ఇక్కడ ఉన్నా..’ అని ఆమె చెప్పారు.

పూజా ఇటీవల రోహిత్‌శెట్టి-రణ్‌వీర్‌ సింగ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘సర్కస్‌’కు సంతకం చేశారు. ఇందులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, వరుణ్‌ శర్మ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి పూజా మాట్లాడుతూ.. ‘నాకు రోహిత్‌ శెట్టి సినిమాలంటే ఇష్టం. నేను, నాన్న కలిసి ‘సింబా’ చూశాం. అజయ్‌ దేవగణ్‌ ఎంట్రీ మాకెంతో నచ్చింది. కొన్నేళ్ల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో తొలిసారి రోహిత్‌ శెట్టిని కలిశా. ఇప్పుడు ఆయన చిత్రంలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. పూజా ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘రాధేశ్యామ్‌’లో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని