బిహార్‌ ఎన్నికలను వాయిదా వేయండి: ఎల్‌జేపీ - Postpone Bihar Assembly Elections
close
Published : 01/08/2020 12:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిహార్‌ ఎన్నికలను వాయిదా వేయండి: ఎల్‌జేపీ

పట్నా: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను అక్టోబర్‌-నవంబరులో నిర్వహించొద్దని భాజపా మిత్రపక్షమైన లోక్‌జనశక్తి ఎన్నికల సంఘాని(ఈసీ)కి లేఖ రాసింది. ఒక వేళ నిర్వహిస్తే ప్రజలను ఉద్దేశపూర్వకంగా మృత్యువువైపు తీసుకెళ్లడమేనని వ్యాఖ్యానించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను అరికట్టడం, వరద సమస్యలపైనే దృష్టి పెట్టాలని సూచించింది. కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో ఉందని తెలిపింది. అక్టోబర్‌-నవంబర్‌ కల్లా తీవ్రత మరింత పెరగొచ్చనే నిపుణుల అంచనాలను గుర్తుచేసింది. అందరి ప్రాధాన్యం ప్రజల ప్రాణాలను కాపాడడమే తప్ప ఎన్నికలు నిర్వహించడం కాదని లేఖలో అభిప్రాయపడింది. 

మరోవైపు ఎన్నికల నిర్వహణకు జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మాత్రం సానుకూలంగా ఉన్నారు. భాజపా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ మాత్రం ఎన్నికలను వాయిదా వేయాలని ఈసీకి ఇప్పటికే సూచించింది. వచ్చే నవంబరు 29న ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలపై ఈసీ రాజకీయ పార్టీల నుంచి సలహాలు-సూచనలను కోరింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని