పవన్‌కు ఈ వీడియో బాగా నచ్చిందట! - Power stat pawan posts a viral video that he likesmuch
close
Published : 30/08/2020 20:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌కు ఈ వీడియో బాగా నచ్చిందట!

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు దేశభక్తి ఎక్కువ. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ దేశానికి సంబంధించిన పోస్టులను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు. తాజాగా ‘‘మన మాతృభూమి అంటే ఇది’’ అని ట్వీట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ఒకటి పోస్టు చేశారు.

ఇటీవల బెంగళూరులో ఓ గుడి వద్ద అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక దేవాలయం దగ్గర ముస్లిములు మానవహారంలా నిలబడి గుడికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆపేందుకు ప్రయత్నించారు. ఆ వీడియోను పవన్ ఇప్పుడు తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మరోవైపు పవన్‌ పుట్టిన రోజు సెప్టెంబర్‌ 2న  ‘వకీల్‌ సాబ్‌’ చిత్రానికి సంబంధించి అప్‌డేట్స్‌ వస్తాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని