పవర్‌స్టార్‌-సూపర్‌స్టార్‌ కలుస్తున్నారా? - Powerstar In Sarkaru vaaripata
close
Updated : 05/12/2020 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవర్‌స్టార్‌-సూపర్‌స్టార్‌ కలుస్తున్నారా?

ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు

హైదరాబాద్‌: దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ ముఖానికి రంగులద్దుకుని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తనని మరోసారి వెండితెరపై చూడాలనే ఆశతో ఉన్న సినీ ప్రేమికుల కోరికను మన్నిస్తూ ఆయన వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేసేశారు. మరోవైపు, ‘సరిలేరు నీకెవ్వరు’తో ఈ ఏడాది ఆరంభంలోనే బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ కోసం సిద్ధమవుతున్నారు. అయితే, పవన్‌-మహేశ్‌ కలిసి నటిస్తే చూడాలని ఎంతోకాలం నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

మహేశ్‌బాబు-పవన్‌కల్యాణ్‌ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారంటూ నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. కాకపోతే, అది పూర్తిస్థాయిలో కాదు కేవలం కొంతసమయం మాత్రమేనట. మహేశ్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘సర్కారువారి పాట’లో పవన్‌ అతిథిగా కనిపించనున్నారట. పవన్‌ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్ర్కీన్‌పై మెరవనున్నారట. ఈ మేరకు పలు పోస్టర్లు, పోస్టులు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సదరు వార్తలు చూసిన ఫ్యాన్స్‌ ఎంతో సంతోషిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నాటి తమ కల నిజమైతే బాగుండని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. పవన్‌కల్యాణ్‌ నటించిన ‘జల్సా’కు మహేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి

షోలో రేణూదేశాయ్‌ ఎమోషనల్‌

సినిమా ట్రైలర్‌ ఎలా మొదలైందంటే?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని