ప్రభుదేవా ఆమెతో ప్రేమలో పడ్డారా? - Prabhu Deva to tie the knot again
close
Published : 13/11/2020 10:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుదేవా ఆమెతో ప్రేమలో పడ్డారా?

పెళ్లి గురించి జోరుగా ప్రచారం

చెన్నై: ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుదేవా మరోసారి వివాహం చేసుకోనున్నారా అంటే..? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ప్రభుదేవా, అతని భార్య రామలతల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఓ నటీమణిని ప్రేమ వివాహం చేసుకోనున్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. తాజాగా ప్రభుదేవా తన బంధువుతో ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆమె కూడా ప్రభుదేవా ప్రేమను అర్థం చేసుకుందని.. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. పెళ్లి వార్తలపై ప్రభుదేవా మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

గతేడాది విడుదలైన ‘దబాంగ్‌ 3’ చిత్రంతో దర్శకుడిగా బాలీవుడ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రభుదేవా. ప్రస్తుతం ఆయన సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ‘రాధే’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులను ముగించుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని