close
Published : 23/11/2020 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మెగాస్టార్‌ ప్రశంస.. మర్చిపోను: ప్రదీప్‌

హైదరాబాద్‌: తనదైన కామెడీ టైమింగ్‌తో సక్సెస్‌ఫుల్‌ యాంకర్‌గా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలను హోస్ట్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రదీప్. తాజాగా ఆయన సుమ నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్‌షోలో సందడి చేశారు. తన పర్సనల్‌ లైఫ్‌ గురించి బయటవారికి తెలియని ఎన్నో సరదా సంగతులను పంచుకున్నారు.

‘‘యాంకరింగ్‌ ప్రేక్షకులకు మరింత చేరువైన సమయంలో మొదటిసారి మెగాస్టార్‌ చిరంజీవిని కలవడానికి వెళ్లినప్పుడు దూరం నుంచే ఆయన నన్ను చూసి.. దగ్గరకు రమ్మని పేరు పెట్టి పిలిచారు. ‘మీ వాయిస్‌ నాకు బాగా ఇష్టం. మీరు పలికే తెలుగు పదాల ఉచ్చారణ నాకెంతో నచ్చుతుంది’ అని ఆయన ప్రశంసించారు. ఆయన మాటలతో అలాగే నిల్చుండిపోయాను. వెంటనే ఆయన కూర్చొండి అని చెప్పారు. ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’’ అని ప్రదీప్‌ వివరించారు. అంతేకాకుండా తాను కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ‘నీలి నీలి ఆకాశం’ పాటకు ఊహించని రెస్పాన్స్‌ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని