విషమంగానే ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం! - Pranab Mukherjee health condition critial
close
Published : 12/08/2020 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విషమంగానే ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం!

దిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రక్తప్రసరణ సవ్యంగానే సాగుతోందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో ఆర్మీ ఆసుపత్రి పేర్కొంది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌కు ఈనెల 10వ తేదీన శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో జరిపిన వైద్య పరీక్షల్లో ప్రణబ్‌కు కొవిడ్‌ వైరస్‌ సోకినట్లు తేలింది. ప్రణబ్‌ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతితోపాటు పలువురు నేతలు ఆకాంక్షించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని