close
Array ( ) 1

తాజా వార్తలు

కరోనా కల్లోలంపై ‘అ!’ దర్శకుడి సినిమా

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్‌పై యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సినిమా తెరకెక్కించబోతున్నారట. ‘అ!’ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. కాజల్‌, నిత్యా మేనన్‌, ఈషా రెబ్బా, రెజీనా, అవసరాల శ్రీనివాస్‌, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఉత్తమ మేకప్‌ విభాగంలో జాతీయ అవార్డు గెలుచుకుంది. దీనికి సీక్వెల్‌ రూపొందించాలి అనుకున్నారు. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని, ‘అ!’ ఫ్రాంచైజ్‌ను కొనసాగిస్తామని ప్రశాంత్‌ చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.

2019 డిసెంబరులో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు తెలిసిన తర్వాత ప్రశాంత్‌ స్క్రిప్టు పనులు మొదలు పెట్టారట. ఈ మేరకు పరిశోధనలు కూడా చేసినట్లు సమాచారం. ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉందని, నటీనటుల్ని ఇంకా ఎంపిక చేయలేదని తెలిసింది. ఈ సినిమా నిర్మాణంలో ప్రశాంత్‌ భాగస్వామ్యం వహించబోతున్నారట. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిపోయిన తర్వాత ఈ సినిమా షూట్‌ ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ప్రశాంత్‌ ఇంకా స్పందించలేదు. కరోనా వైరస్‌పై సినిమాలు తీయడానికి పలు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే టైటిల్స్‌ను కూడా నమోదు చేయించుకున్నారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.