కరోనా: రానున్న 3 నెలలు ఎంతో కీలకం - Precautions should be Taken for Corona Virus During winter season Dr. Srinivas
close
Published : 06/11/2020 19:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా: రానున్న 3 నెలలు ఎంతో కీలకం

తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాస్‌ వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తున్నా రానున్న మూడు నెలలు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ పేర్కొంటోంది. నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో చలి పెరగడంతోపాటు వైరస్‌ వ్యాప్తికి అనుకూల వాతావరణం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌, అమెరికాలో ఇప్పటికే కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి మొదలవ్వడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో సంచార వాహనాల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తూ వీలైనంత త్వరగా వైరస్‌ బాధితులను గుర్తిస్తామంటున్నారు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాస్‌. వైరస్‌ గురించి ఆయన పలు విషయాలు వెల్లడించారు.

తెలంగాణలో కొవిడ్‌ కేసులు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నట్లు ఆయన‌ పేర్కొన్నారు. ప్రతిరోజు 45 వేల నుంచి 50 వేల పరీక్షలు నిర్వహిస్తున్నామని, గత నెల రోజుల నుంచి అతితక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. పాజిటివిటీ రేటు కేవలం 3.5శాతం మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు 18వేలు మాత్రమే ఉన్నాయని, 2600 నుంచి 2800 మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మిగతావారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. 

అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గినప్పటికీ వైరస్‌ ఇంకా పోలేదని, రానున్న మూడు నెలలు ఎంతో కీలకమన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. కొవిడ్‌తోపాటు ఇతర వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలను చైతన్యం చేస్తోందని పేర్కొన్నారు. డా.శ్రీనివాస్‌ వీటితోపాటు పలు విషయాలు చర్చించారు. పూర్తి వివరాలకోసం ఈ వీడియో చూడండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని