Sharwanand: శర్వా.. ‘ఒకే ఒక జీవితం’ - Presenting the first look of Sharwa30 Oke Oka Jeevitham
close
Updated : 29/06/2021 05:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sharwanand: శర్వా.. ‘ఒకే ఒక జీవితం’

శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీకార్తిక్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ సినిమాకి ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో శర్వానంద్‌ గిటార్‌ పట్టుకుని కనిపించారు. ‘‘సైన్స్‌ ఫిక్షన్‌ ఎలిమెంట్స్‌తో నిండిన కుటుంబ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులోని తల్లి - కొడుకుల అనుబంధం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అక్కినేని అమల ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీతూ వర్మ కథానాయిక. ఈ సినిమాకి దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలియజేసింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని