కొరియోగ్రాఫర్‌కి ప్రియమణి షాక్‌..! - Priyamani Shocks Yash Master
close
Published : 19/10/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొరియోగ్రాఫర్‌కి ప్రియమణి షాక్‌..!

హైదరాబాద్‌: కొరియోగ్రాఫర్‌ యశ్‌కు నటి ప్రియమణి షాకిచ్చారు. ‘ఈటీవీ’లో ప్రసారమవుతోన్న డ్యాన్స్‌ షో ‘ఢీ ఛాంపియన్స్‌’లో శేఖర్‌మాస్టర్‌, పూర్ణతోపాటు ఆమె న్యాయనిర్ణేతగా కొనసాగుతున్నారు. అయితే, ఈ డ్యాన్స్‌ రియాల్టీ షోలో భాగంగా గ్రూప్‌ లెవల్‌లో తలపడిన కొంతమంది తాజాగా క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగుపెట్టారు. దీంతో కంటెస్టెంట్స్‌ మధ్య పోరు హోరాహోరీగా మారింది.

కాగా, త్వరలో ప్రసారం కానున్న క్వార్టర్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టేందుకు కంటెస్టెంట్స్‌తోపాటు డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు కష్టపడిన తీరు అందరితో ‘వావ్‌’ అనేలా చేస్తోంది. కొరియోగ్రాఫర్‌ యశ్‌ ట్రైన్‌ చేస్తున్న కంటెస్టెంట్‌.. ‘యువకుల మనసైనా..’ అనే సాంగ్‌కు వివిధ రకాలుగా డ్యాన్స్‌ చేశాడు. అతని డ్యాన్స్‌ పై ప్రియమణి స్పందిస్తూ.. ‘మీ నుంచి ఇది క్వార్టర్‌ ఫైనల్‌ ప్రదర్శన కాదు’ అని అంటారు. ప్రియమణి మాటతో కంటెస్టెంట్‌తోపాటు యశ్‌ సైతం షాక్‌కి గురవుతాడు. వచ్చే బుధవారం (అక్టోబర్‌ 21) రాత్రి ప్రసారం కానున్న ‘ఢీ ఛాంపియన్స్‌’ ప్రోమో చూడండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని