తరుణ్‌-నేనూ ప్రేమలో ఉన్నామన్నారు: ప్రియమణి - Priyamani opens up on her rumoured affair with Tarun
close
Published : 22/11/2020 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తరుణ్‌-నేనూ ప్రేమలో ఉన్నామన్నారు: ప్రియమణి

హైదరాబాద్‌: తరుణ్‌, ప్రియమణి జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నవ వసంతం’. కె.షాజహాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007లో విడుదలై ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సినిమా సమయంలో ప్రియమణి-తరుణ్‌ ప్రేమలో ఉన్నారని చాలామంది చెప్పుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారంటూ అప్పట్లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియమణి సదరు రూమర్స్‌పై స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితం గురించి ఆమె తెలియజేశారు.

‘‘నవ వసంతం’ షూటింగ్ సమయంలో నేనూ-తరుణ్‌ ప్రేమలో ఉన్నామని.. మేమిద్దరం వివాహం చేసుకోనున్నామని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ రోజు తరుణ్‌ వాళ్లమ్మ రోజారమణి గారు మా సెట్‌కి వచ్చారు. ‘మీ ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా? ఒకవేళ అదే కనుక నిజమైతే పెళ్లి చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరాల్లేవు. ఏదైనా సరే నువ్వు నాతో ఫ్రెండ్లీగా చెప్పవచ్చు’ అని ఆమె నన్ను అడిగారు. మా గురించి బయటవాళ్లు అలా మాట్లాడుకుంటున్నారని ఆమె చెప్పేదాకా నాకు తెలియలేదు. ఒకే హీరోతో వరుసగా రెండు లేదా మూడు సినిమాలు చేస్తే ఇలాంటి రూమర్స్‌ వస్తాయనుకున్నా కానీ తరుణ్‌తో నేను చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ ఇలాంటి పుకార్లు వచ్చాయి. ఏది ఏమైనా అవన్నీ అవాస్తవాలు మాత్రమే.’ అని ప్రియమణి వెల్లడించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని