గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి - Priyamani plays chef in His Storyy who cant boil an egg
close
Updated : 29/04/2021 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి

ముంబయి: ఒకప్పుడు తెలుగులో వరుస చిత్రాల్లో కథానాయికగా అలరించారు నటి ప్రియమణి. ప్రస్తుతం టెలివిజన్‌ షోలతో పాటు, పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు, ‘హిజ్‌ స్టోరీ’ అనే హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఇందులో ఆమె సాక్షి అనే చెఫ్‌ పాత్రలో నటించింది.

తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర గురించి స్పందిస్తూ..‘‘ఈ చిత్రంలో నేను చెఫ్‌గా నటించాను. కానీ, నిజంగా నాకు కోడి గుడ్డు ఉడకబెట్టడం కూడా తెలియదు. సినిమా షూటింగ్‌ సెట్‌లో ఉన్న యువకులు నాకంటే బాగా వంటచేసేవారు. అలాంటిది నేను వంటగదిలో చేసే పోరాటాన్ని చూసి సెట్లో అందరూ నవ్వుకునేవారు. ఇక తోటి సహనటులైతే నాపై జోకులు వేసుకునేవారు. ఇందులో నా నటనను చూసి ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు’’అని తెలిపింది.

ప్రశాంత్‌ భాగియా దర్శకత్వంలో బాలాజీ టెలిఫిల్మ్స్, డింగ్ ఇన్ఫినిటీ సంస్థలు కలిసి ఈ వెబ్‌సిరీస్‌ చిత్రాన్ని నిర్మించాయి. తన్వీర్‌ బుక్‌వాలా నిర్మాత. ఇందులో సత్యదీప్‌ మిశ్రా, మృణాల్‌దత్‌ కీలక పాత్రల్లో నటించగా నితిన్ భాటియా, పరిణిత సేథ్, రాజీవ్ కుమార్, చారు శంకర్, మిఖాయిల్ గాంధీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ALT బాలాజీ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 25న ఈ సిరీస్‌ విడుదలైంది. ప్రియమణి ప్రస్తుతం ‘విరాటపర్వం’, ‘నారప్ప’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హిందీలో అజయ్‌ దేవగణ్‌తో కలిసి ‘మైదాన్‌’ చిత్రంలో నటిస్తోంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని