close

తాజా వార్తలు

చీరకట్టులో మెరిసిన ముద్దుగుమ్మలు

వేడుకగా ‘ఉమాంగ్‌-2020’ 

ముంబయి: ముంబయి పోలీసుల సేవలను గుర్తుచేసుకుంటూ వారి గౌరవార్థం ప్రతి ఏటా నిర్వహించే ‘ఉమాంగ్‌’ కార్యక్రమం ఈ ఏడాది కూడా అట్టహాసంగా జరిగింది. ‘ఉమాంగ్‌-2020’ పేరుతో ఆదివారం సాయంత్రం ముంబయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్‌ తారలు పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా, కత్రినాకైఫ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, విద్యాబాలన్‌, జాన్వీకపూర్‌ చీరకట్టులో మెరిసిపోయారు. మరోవైపు బాలీవుడ్‌ అగ్రకథానాయకులు సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌తోపాటు వరుణ్‌ ధావన్‌, కార్తీక్‌ ఆర్యన్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొని అలరించారు. అంతేకాకుండా వరుణ్‌ ధావన్‌, కార్తీక్‌ ఆర్యన్ డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను మెప్పించారు. మరోవైపు షారుఖ్‌ సైతం స్టేజ్‌పై డ్యాన్స్‌ చేయడంతోపాటు తన మాటలతో నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.