
తాజా వార్తలు
‘టెక్ట్స్ ఫర్ యూ’ అంటోన్న ప్రియాంకచోప్రా
ఇంటర్నెట్ డెస్క్: ప్రియాంకచోప్రా నటిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘టెక్స్ట్ ఫర్ యూ’ షూటింగ్ ప్రారంభమైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంకచోప్రాతో పాటు గ్రామీ అవార్డు గ్రహీత, పాప్ గాయని సెలిన్ డియోన్, హీరోగా సామ్ హ్యుగన్ కనిపించనున్నారు. జెర్మన్‌లో వచ్చిన ‘ఎస్సెమ్మెస్ ఫర్ డిచ్’ అనే సినిమాకు ఇంగ్లీష్‌లో రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రమిది. దీనికి జిమ్ స్ట్రాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. సినిమా చిత్రీకరణకు సంబంధించిన వార్తను ప్రియాంకచోప్రా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.
ఈ సినిమాలో.. కాబోయే భర్తను కోల్పోయిన యువతిగా ప్రియాంక కనిపించనుంది. అతడిని మర్చిపోలేని ఆమె ఆ యువకుడి పాత ఫోన్ నంబర్‌కు సందేశాలు పంపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అచ్చం అలాంటి సమస్యే ఎదుర్కొంటున్న మరో వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుంది..? వాళ్లిద్దరూ ఒక్కటవుతారా లేదా..? అన్నదే సినిమా కథాంశం.
కెనడాకు చెందిన గాయని సెలిన్ డియోన్.. చిత్రంలో కూడా గాయనిగానే కనిపించనుంది. తొలి ప్రేమను పొందడంలో విఫలమైన ఇద్దరూ ధైర్యంగా మరో అడుగు వేయడంలో సెలిన్ సంగీతం కీలక పాత్ర పోషిస్తుందట. ఇదిలా ఉండగా.. ప్రియాంకతో కలిసి నటిస్తున్న సామ్ హ్యుగన్ ‘ఔట్‌లాండర్’ అనే సినిమాతో హాలీవుడ్‌కు సుపరిచితుడు. ఇటీవల విన్ డీసిల్ హీరోగా వచ్చిన ‘బ్లడ్షాట్’, ‘ది స్పై హూ డంపుడ్ మీ’ చిత్రాల్లోనూ అతడు నటించాడు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- స్మిత్ చూస్తుండగానే రోహిత్ షాడో బ్యాటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
