
తాజా వార్తలు
అమితాబ్‌కు ప్రియాంక ఛాలెంజ్
మీ భద్రత కోసం మీరు తప్పక చేయాల్సిన పని ఇది అంటోన్న నటి
ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను ప్రముఖ నటి ప్రియాంక చోప్రా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న కారణంగా కొన్ని రోజుల నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్న ఆమె బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్‌తో ఇన్‌స్టా వేదికగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా వైరస్ విషయంలో అభిమానులు పంపిన ప్రశ్నలకు ప్రియాంక ఆయన నుంచి సమాధానాలు అడిగి తెలుసుకొన్నారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా ట్రెడోస్ అధనోమ్.. ప్రియాంకను సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు.
సేఫ్హ్యాండ్స్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రియాంక.. తనకి కొనసాగింపుగా అమితాబ్‌బచ్చన్‌ను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. ‘WhereEver You Are Wash Your Hands, Who Ever You Are Wash Your hands.. Its Simple Thing To Do.. Let’s Do It For Me And You.. Who Ever You are Wash Your Hands’ అంటూ తన భర్త నిక్ జొనాస్ రాసిన పాటను అలపిస్తూ ప్రియాంక సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ప్రియాంక.. ‘ట్రెడోస్ ఇచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను నేను స్వీకరించాను. సుమారు 20 సెకన్లపాటు చేతులను శుభ్రంగా కడుకుంటే.. మీ ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఈ మహమ్మారి నివారణ కోసం పాటుపడినట్లే. అమితాబ్ బచ్చన్, పరిణితీ చోప్రా, నిక్ జొనాస్లను సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాను’ అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.