27 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌..! - Producer KT Kunjumon announces sequel to Arjun superhit film
close
Updated : 11/09/2020 10:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

27 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌..!

వినిపిస్తోన్న అగ్రనటీనటుల పేర్లు..

చెన్నై: యాక్షన్‌ హీరో అర్జున్‌ కథానాయకుడిగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘జెంటిల్‌మేన్‌’. 1993లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నిర్మాత కేటీ కుంజుమన్‌ (Kunjumon) ‘జెంటిల్‌మేన్‌’ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు ప్రకటించారు. ‘ఒకప్పుడు మేము నిర్మించిన మెగా బ్లాక్‌బస్టర్‌ ‘జెంటిల్‌మేన్‌’ సినిమాకి సీక్వెల్‌గా త్వరలో ‘జెంటిల్‌మేన్‌-2’ నిర్మించనున్నాం. ఈవిషయాన్ని మీ అందరితో పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌లో బాలీవుడ్‌, దక్షిణాది పరిశ్రమకు చెందిన అగ్రనటీనటులు నటించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సీక్వెల్‌ని కూడా శంకర్‌ రూపొందించనున్నారో, లేదో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

రాజకీయనేతల అవినీతిని గుట్టురట్టు చేయడంతోపాటు, మన దేశంలోని విద్యావ్యవస్థ గురించి తెలియజేసేలా ‘జెంటిల్‌మేన్‌’ చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు శంకర్‌ తొలి ప్రయత్నంగా ‘జెంటిల్‌మేన్‌’ తెరకెక్కింది. అర్జున్‌ సరసన మధుబాల, శుభశ్రీ నటించారు. తమిళంలో రూపొందిన ఈ సినిమా హిట్‌ చిత్రంగా నిలిచింది. దీంతో ఈ సినిమాని 1994లో ‘ది జెంటిల్‌మేన్‌’ పేరుతో హిందీలో తెరకెక్కించారు. చిరంజీవి కథానాయకుడిగా నటించగా మహేశ్‌భట్‌ దర్శకత్వం వహించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని